ETV Bharat / state

ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా.. - mahabubnagar crime news

కేవలం ఐదు నిమిషాలు ప్రయాణిస్తే ఇంటికి చేరేంత దూరం.. ఆ లోపలే ద్విచక్రవాహనం రూపంలో మృత్యువు అనంత లోకాలకు తీసుకుపోయింది. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

bike accident in mahabubnagar
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా..
author img

By

Published : Sep 24, 2020, 6:14 PM IST

ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్​ సమీపంలో చోటుచేసుకొంది. వ్యక్తిగత పనులు కోసం జడ్చర్లకు వెళ్లిన గంగాపూర్​ గ్రామానికి చెందిన గోవర్ధన్.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. 167వ జాతీయ రహదారి పక్కన ఎల్లమ్మ ఆలయం సమీపంలో బైక్​ అదుపుతప్పింది. అక్కడకక్కడే మృతిచెందాడు. కేవలం 5 నిమిషాల్లో ఇళ్లు చేరుకుంటాడనగా ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

ఇవీచూడండి: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.