ETV Bharat / state

ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు! - తెలంగాణ తాజా అప్డేట్స్

కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులను పునరుద్ధరింస్తున్నారు. కొవిడ్ వార్డుల కోసం సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు.

beda availability in mahabubnagar, mahabubnagar beds availability
మహబూబ్​నగర్​లో పడకల అందుబాటు, మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : Apr 18, 2021, 11:35 AM IST

Updated : Apr 18, 2021, 2:45 PM IST

కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రులు అప్రమత్తమయ్యాయి. కరోనా వార్డులను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 2300 పడకలు అందుబాటులో ఉండగా వాటిల్లో 100 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. సుమారు 4వేల మంది హోం ఐసోలేషన్​లోనే చికిత్స అందిస్తున్నారు. అన్నిరకాల సేవలూ అందుబాటులో ఉన్నా.. జనం అప్రమత్తంగా ఉండి కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

మహబూబ్​నగర్​లో పడకల అందుబాటు, మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా కేసులు

రెండు వేల పడకలు సిద్ధం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కోరలు చాస్తుండటంతో... రోగులకు చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచారు. అత్యవసర చికిత్స కోసం వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, సిటీస్కాన్‌ పరికరాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం 2వేల370 పడకలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఆందోళన వద్దు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 16 వందల 10 పడకలు సిద్ధం చేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 130పడకలు ఏర్పాటుచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించవచ్చని చెప్పడంతో జిల్లాలో 53ఆసుపత్రులు ముందుకువచ్చాయి. జిల్లా వ్యాప్తంగా రెండున్నర వేలకు పైగా క్రీయాశీల కేసులుండగా... 49మంది ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో, 23మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 70 బెడ్లు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కరోనా బాధితుల సంఖ్య నారాయణపేట జిల్లాలో పెరుగుతున్నా జిల్లా ఆసుపత్రిలో మాత్రం ఎవరూ చేరలేదు. ప్రస్తుతం జిల్లాలో 395 క్రీయాశీల కేసులున్నాయి. కొవిడ్ బారిన పడిన రోగులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని, చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటిండెంట్ రాంకిషన్ వెల్లడించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 170 పడకలు అందుబాటులో ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో 50, కల్వకుర్తి ఆసుపత్రిలో 30, అచ్చంపేటలో 30, కొల్లాపూర్‌లో 30, అమ్రాబాద్‌లో 30 చొప్పున మంచాలు సిద్ధం చేశాం. 11 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి జిల్లాలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే 150 బెడ్లు సిద్ధం చేశాం. జిల్లాలో 1,260 యాక్టివ్‌ కేసులు ఉన్నా.. కేవలం ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. మిగతా 1258 మంది ఇళ్ల దగ్గరే ఉంటూ చికిత్స చేయించుకొంటున్నారు. ప్రస్తుతానికి 148 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు.

-సుధాకర్ లాల్, నాగర్ కర్నూల్ డీఎంహెచ్​వో

అప్రమత్తత అవసరం

జోగులాంబ గద్వాల జిల్లాలో 370 పడకలను కొవిడ్ బాధితుల కోసం సిద్ధం చేశారని డీఎంహెచ్​వో చందు నాయక్ తెలిపారు. గద్వాల జిల్లా ఆసుపత్రిలో 120, అందులో 70 మంచాలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. వాటితో పాటు నది అగ్రహారం వద్దనున్న పీజీ మెడికల్‌ కళాశాలలో 100 బెడ్లు, ఉండవల్లి వద్ద ప్రభుత్వ వసతి గృహంలో 150 బెడ్లు సిద్ధం చేసి, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో 400 కేసులు యాక్టివ్‌గా ఉండగా... అందులో 25 మంది మాత్రమే గద్వాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. 400కు పైగా మంది ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా ప్రజలు అప్రమతంగా ఉండాలని కోరారు.

విధిగా మాస్క్ ధరించాలి

ఇంట్లో ఎవరో ఒకరికి లక్షణాలు కనిపిస్తే.. పరీక్షల అనంతరం ఇంట్లో ఉన్నకుటుంబ సభ్యుల్లో ఎక్కువ మందికి పాజిటివ్​గా వస్తోందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ విస్తరించే తీవ్రత అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక కొవిడ్ కేసుల్లో మరణాల రేటు సైతం పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు. సెకండ్ వేవ్​ను దృష్టిలో ఉంచుకుని గతంలో కంటే పడక్బందీగా మాస్కు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. మరోవైపు వాక్సిన్ వేసుకునే వారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది.

ఇదీ చదవండి: ఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు- 1500 మరణాలు

Last Updated : Apr 18, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.