ఈటీవీలో వచ్చిన కథనాల ఆధారంగా... మహబూబ్నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లిలోని సర్వే నంబర్ 523లో భూమిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ముగ్గురు సభ్యుల విజిలెన్స్ బృందం ఈ సర్వే నంబర్ భూములపై ఆరా తీసింది.
ఈ సర్వే నంబర్లోని భూమి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? 1954 నుంచి ఇప్పటి వరకూ ఆ భూములను ఎవరెవరికి కేటాయించారో పాత, కొత్త దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి... రికార్డులను సైతం పరిశీలన కోసం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ సర్వే నంబర్లో దొంగపట్టాలు, అక్రమ నిర్మాణాలపై పలుమార్లు కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకునేందుకే ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్లో సమంత సరికొత్త రికార్డు