మహబూబ్‌నగర్ జిల్లాలోనే అతి తక్కువ నిధులతో బండర్‌పల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు జలకళ వచ్చింది. వరుస వర్షాలతో వరద నీరు వచ్చి చేరడం వల్ల చెక్‌డ్యామ్ కొత్త అందాన్ని సంతరించుకుంది. మహబూబ్‌నగర్ – నారాయణపేట్ జిల్లాలను కలిపే బండర్‌పల్లి వాగుపై రూ.60 లక్షల ఖర్చుతో ఈ డ్యామ్ నిర్మించారు.
మహబూబ్‌నగర్ – రాయచూర్‌కు వెళ్లే రహదారిపై ఈ డ్యామ్ ఉండడం వల్ల చూపరులను ఆకట్టుకుంటున్నది. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు కాసేపు ఆగి.. చెక్‌డ్యామ్ జల సవ్వడిని ఆస్వాదించి ముందుకు సాగుతున్నారు. చెక్‌డ్యామ్ నిండడం వల్ల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయంటూ.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బండర్ పల్లి వాగు నిండడం వల్ల దేవరకద్ర, చింతకుంట, మరికల్ మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'