మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారులు బుధవారం నుంచి స్వయం నియంత్రిత పనివేళల్ని పాటిస్తున్నారు. కిరాణ, హర్డ్‌వేర్, సహా అన్ని రకాల దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్టు వ్యాపార,వాణిజ్య దుకాణదారుల సంఘం నాయకులు తెలిపారు.
అత్యవసర సేవల విభాగంలో ఉన్న వ్యాపారాలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నాయి. జనంలో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని తరుణంలో ప్రజలకు, కుటుంబ సభ్యుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
నో మాస్క్ నో సర్వీస్, సహా శానిటైజర్లు అందుబాటులో ఉంచినా.. ఇటీవల పట్టణంలో చాలామంది మహమ్మారి బారిన పడడం వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. సుమారు 400పైగా కేసులు పట్టణంలోనే నమోదు కావడం కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణంలో 139 కేసులు నమోదు కాగా...120కి పైగా పాజిటివ్ కేసులు ప్రస్తుతం క్రీయాశీలంగా ఉన్నాయి.
కరోనాను కట్టడి చేసేందుకు బాదేపల్లిలో ఆగస్టు 3 వరకూ... అన్ని దుకాణాలను స్వచ్ఛదంగా మూసి వేశారు. వీధుల్లో ఉండే చిన్నచిన్న దుకాణాలు మాత్రం నిత్యావసరాల కోసం కొద్ది సేపటి వరకే తెరచి పెడుతున్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు