దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో సౌత్ జోన్ (ఐదు రాష్ట్రాలు) ప్రతినిధి రమాకాంత్... మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో దూరదర్శన్ లో ప్రసారం అవుతున్న డిజిటల్ తరగతుల పై కలెక్టర్ తో చర్చించారు. జిల్లాలోని ప్రతి గ్రామం... ప్రతి ఇంటికి దూరదర్శన్ ప్రసారాలు ఉండేటట్లు చొరవ తీసుకోవాలని వి. రమాకాంత్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
రాబోయే రోజుల్లో జిల్లావ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో ఫ్రీక్వెన్సీ కవర్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు రమాకాంత్ కలెక్టర్కు వివరించారు. కరోనా సమయంలో దూరదర్శన్లో డిజిటల్ తరగతులను ప్రసారం చేయడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని ఈ సమయంలో ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన దూరదర్శన్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.