హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్మికులు మానసిక ధైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అతిపెద్ద నిరసన కార్యక్రమం చేపటాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో 50 శాతం బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. ఆర్టీసీ జేఏసీ ఇస్తున్న కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని సంపత్‌కుమార్ తెలిపారు.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన