ETV Bharat / state

నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు

పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ కానిస్టేబుల్‌గా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి... మర్నాడే మామూళ్లు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 17, 2019, 7:17 AM IST

Updated : Aug 17, 2019, 7:30 AM IST

నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్​స్టేషన్​లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమాని నుంచి 17 వేలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్‌ పట్టుబడ్డాడు. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ముడావత్‌ రమేశ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తరలిస్తున్నప్పటికీ శుక్రవారం తిరుపతిరెడ్డి అతడిని అడ్డుకున్నాడు. రూ. 17,000 ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని బెదిరించాడు. లేదంటే తప్పుడు కేసులను బనాయిస్తానని భయబ్రాంతులకు గురిచేశాడు. తిరుపతిరెడ్డి వైఖరితో విసిగిపోయిన రమేశ్‌ ఏసీబీ అధికారులను సంప్రదించి వలపన్నారు.

శుక్రవారం సాయంత్రం సాక్షాత్తు పోలీసుస్టేషన్​ ఆవరణలోనే రమేష్‌ వద్ద తిరుపతిరెడ్డి డబ్బు వసూలు చేశాడు. ఆ సొమ్ము తీసుకుని స్టేషనులోకి కానిస్టేబుల్‌ అడుగుపెట్టగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుని నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మిగతా అధికారులకు ఏమైనా సంబంధం ఉందా? అని అడిగితే.. ఎవరికీ సంబంధం లేదని, తానే తీసుకున్నానని అంగీకరించాడు. ఇసుక వ్యాపారుల నుంచి తిరుపతిరెడ్డి చాలా రోజులుగా మామూళ్ల దందా సాగిస్తున్నాడని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ఇసుక వ్యాపారి రమేశ్‌ తెలిపారు. రెండేళ్లుగా విధిలేక తానే ఎన్నోసార్లు అతడికి డబ్బులు ఇచ్చానని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక సరఫరా చేస్తున్నప్పటికీ లంచాల పేరుతో వేధించడం వల్ల విసిగి ఏసీబీని ఆశ్రయించానని తెలిపారు. మరి ఇలాంటి కానిస్టేబుల్‌ని ‘ఉత్తమ’ అవార్డుకు ఎలా ఎంపిక చేశారా అని జనం అవాక్కవుతున్నారు.

నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు

ఇదీ చూడండి : 'కోర్టుకెక్కి ఉద్యోగం తెచ్చుకున్నాడు'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 17, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.