ETV Bharat / state

Delivery At Bustand: బస్టాండ్​లో అరుదైన సంఘటన.. తల్లీ, బిడ్డ క్షేమం - ఆర్టీసీ బస్టాండ్​లో మహిళ ప్రసవం

Delivery At Bustand:ఆర్టీసీ బస్టాండ్ ఓ మహిళ ప్రసవానికి వేదికైంది. ప్రయాణికుల ప్రాంగణమే ఆమెకు ఆస్పత్రిగా మారింది. పురిటి నొప్పులతో ఓ తల్లి కేకలు వేయగా.. అదే సమయంలో పండంటి పసికందు ఏడుపు అందరిని ఆశ్చర్యపరిచింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆడబిడ్డ జన్మనివ్వడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.

Delivery At Bustand
ర్టీసీ బస్టాండ్ ఓ మహిళ ప్రసవం
author img

By

Published : Jan 19, 2022, 5:24 AM IST

Delivery At Bustand: మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర బస్టాండ్ ఓ మహిళ ప్రసవానికి వేదికగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వరమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా బస్టాండ్​లో ప్రయాణికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

devarakadra bustand: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వరమ్మకు నారాయణపేట జిల్లా మరికల్ గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహమైంది. తొలి కాన్పులో బాబు పుట్టాడు. రెండో కాన్పు చేసేందుకు వెంకటేశ్వరమ్మ తన తల్లితో కలిసి దేవరకద్రకు బయలుదేరింది. దేవరకద్ర బస్టాండ్​లో బస్సు దిగి బాత్ రూమ్ వెళ్తున్న సమయంలోనే నిండు గర్భిణీ కెవ్వుమని అరుస్తూ పడిపోయింది. తల్లి భర్త దగ్గరకు రాగానే పురిటి నొప్పులు భరిస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈటీవీ ఈనాడు ప్రతినిధి అక్కడికి చేరుకుని 108 కు సమాచారం ఇవ్వడంతో కాసేపట్లోనే వైద్య సిబ్బంది వాహనంతో చేరుకుని తల్లి బిడ్డను క్షేమంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బస్టాండ్​లోనే మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వడం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.