జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదటి దశ కింద చేపట్టాలని జల సాధన సమితి అధ్యక్షుడు అనంత రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు ప్రజా ఉద్యమాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవనంలో జలవనరులు, ప్రాజెక్టులు, ప్రస్తుత పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచర్యణ చేపట్టనున్నామని పేర్కొన్నారు.
ఎన్నికలు ఉన్నాయనే
దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పుడు మేలుకోక పోతే భావి తరాలకు భవిష్యత్తు ఉండదని అనంత రెడ్డి స్పష్టం చేశారు. అటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారని.. మరో మారు పాలమూరు ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము చేపట్టే ప్రజా ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి: తెదేపా ఎమ్మెల్సీ బరిలో రమణ, సాగర్లో మువ్వా