రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 30 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు కలెక్టర్ రొనాల్డ్రోస్తో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రణాళిక అమలుకు ఆయన శ్రీకారం చుట్టారు. 41 వార్డులకు.. 41 మంది ప్రత్యేక అధికారులను నియమించి పుర ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేవలం 30 రోజులకే పరిమితం కాకుండా నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రోడ్లు సహా అన్ని మౌలిక అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 37వ వార్డులో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: సమ్మెతో ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా...?