ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన అధ్యాపకుడు నీలం శ్రీనివాస్ రూపొందించిన సైకత ప్రపంచ పటాన్ని డోర్నకల్ శాసనసభ్యుడు డీఎస్ రెడ్యానాయక్ ఆవిష్కరించారు. కురవి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రూ. 60 వేల వ్యయంతో చిత్రపటాన్ని 15 రోజుల్లోనే తయారుచేశారు. దీని తయారికి ఎనిమిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు గల చెక్కలపై 80 కిలోల ఇసుక, 15 కిలోల జిగురు, 115 కిలోల స్టీల్‌ను వినియోగించారు. చిత్రపటంపై ఆయా ఖండాలకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతల చిత్రపటాలను సైతం చెక్కారు. అధ్యాపకుడు నీలం శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభినందించారు.
ఇవీ చూడండి: అక్రమ రవాణాపై కదంతొక్కిన పోలీసు యంత్రాంగం