వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే 53 ఏళ్ల మహిళ ఉపాధి హామీ పనులు చేస్తూ.. అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. అప్పటివరకు తోటి కూలీలతో పనులు చేస్తున్న మనిషి విగతజీవిగా మారడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై పలు కేసులు