ETV Bharat / state

సర్పంచ్​ను తొలగించాలంటూ కలెక్టరేట్​ వద్ద గ్రామస్థుల ధర్నా - మహబూబాబాద్​ తాజా వార్తలు

గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్న సర్పంచ్​ను తొలగించాలంటూ గ్రామస్థులు... కలెక్టరేట్​ వద్ద ధర్నా చేశారు. మరిపెడ మండలం తానంచర్ల సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

సర్పంచ్​ను తొలగించాలంటూ కలెక్టరేట్​ వద్ద గ్రామస్థుల ధర్నా

author img

By

Published : Sep 21, 2020, 5:19 PM IST

గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా.. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్​ను తొలగించాలని డిమాండ్​ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్​ వద్ద... మరిపెడ మండలం తానంచర్ల గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అవినీతికి పాల్పడుతున్న సర్పంచ్​ను తొలగించి... ఆమె స్థానంలో పెత్తనం చేస్తున్న సర్పంచ్​ భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో మహిళా రిజర్వేషన్ కావడం వల్ల శ్వేతను సర్పంచ్​గా ఎన్నుకున్నామని... కాని ఆమె భర్త ముకేశ్ అధికారం చలాయిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. కరోనా సమయంలో కనీసం గ్రామంలో బ్లీచింగ్​ కూడా చల్లించలేదని... పది నెలలుగా పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించలేదని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి సంబంధిత సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో సుమారు 200మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.