ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ, బకాయి వేతనాలను చెల్లించాలంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యా వాలంటీర్లు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత ఉన్న విద్యా వాలంటీర్లను ప్రతి సంవత్సరం భర్తీ చేసే విధానాన్ని తొలగించి, రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి: స్పీకర్, మండలి ఛైర్మన్‌కు హైకోర్టు నోటీసులు