మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలో ఉన్న వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని నితిన్ భవన్లో మట్టి గణపతులను తయారీ చేస్తున్నారు. రంగులతో కూడుకున్న పెద్ద గణపతులకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా చాలామంది పర్యావరణ వేత్తలు పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పెద్ద రసాయన విగ్రహాల తయారీని ఆపేశారు. దాని కారణంగా లక్షలాది కుటుంబాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి, ప్రకృతిని, పర్యావరణాన్ని గౌరవించాలి, ప్రేమించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు.
వందేమాతరం ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి ఒక వెయ్యి కుటుంబాలకు మట్టి గణపతి విగ్రహాలను వితరణ చేయాలని విద్యార్థులు, ఫౌండేషన్ నిర్వాహకులు పూనుకున్నారు. ఈ మట్టి గణపతులలో వివిద జాతుల విత్తనాలను పెట్టి తయారు చేశారు. గణపతులను నిమజ్జనం చేశాక ఆ విత్తనాలు వృక్షాలుగా పెరిగి పర్యావరణాన్ని కాపాడుతాయని విద్యార్థులు, ఫౌండేషన్ నిర్వాహకులు అంటున్నారు.
ఇవీ చూడండి: 'గణపయ్య పూజకు ఆన్లైన్లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'