ETV Bharat / state

'కొవిడ్ వ్యాక్సిన్ కావాలంటే.. ప్రూఫ్ తప్పనిసరి'

ఈ నెల 16న ప్రారంభం కానున్న కొవిడ్ వ్యాక్సినేషన్​కు మహబూబాబాద్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. టీకా వేసుకునే వారి ఫోన్​కు సమాచారం వస్తుందని వైద్యాధికారులు తెలిపారు. వ్యాక్సిన్​ కేంద్రాలకు వచ్చే వారు ఐడీ ప్రూఫ్​తో రావాలని కోరారు.

Vaccination must come with ID proof mahabubabad
'టీకా వేసుకునే వారు ఐడీ ప్రూఫ్​తో రావాలి'
author img

By

Published : Jan 14, 2021, 5:32 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 1,720 డోసుల కొవిడ్ నియంత్రణ వాక్సిన్ చేరుకుంది. వ్యాక్సిన్​ను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిల్వ చేసి పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న జిల్లాలోని ఏరియా ఆస్పత్రి, కంబాలపల్లి, డోర్నకల్, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. జిల్లాలోని నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో 30 మందికి చొప్పున వ్యాక్సిన్ ఇస్తామని వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. టీకా ఇచ్చే వారికి ఫోన్​ సమాచారం అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఐడి ప్రూఫ్​తో వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

జిల్లాలో 250 మంది సిబ్బందికి వ్యాక్సిన్​ వేసేందుకు శిక్షణ ఇచ్చామని వైద్యాధికారి పేర్కొన్నారు. మొదట జిల్లాలోని 5,066 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత.. నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ను ప్రారంభిస్తామన్నారు. వెబ్​కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డా.రాజేష్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డా.అంబరీష, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఉద్యోగిని ఇంట్లో బొమ్మల కొలువు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.