మహబూబాబాద్ జిల్లా కేంద్రం కంకరబోడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొవిడ్‌కు భయపడి విద్యార్థులు ఇంటికి వెళ్తుండగా వారికి ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పరీక్షలు చేయించారు. విద్యార్థులకు ఎవరికీ వైరస్ సోకలేదని వెల్లడించారు.
శానిటేషన్ చేస్తున్నా..
ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో విద్యార్థులంతా తిరిగి హాస్టల్‌కు వెళ్లారు. పాఠశాలలో ప్రతి రోజూ తరగతి గదుల్లో శానిటేషన్ చేస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు భోధిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇద్దరికి కరోనా సోకిందన్నారు.
ఈ విషయాన్ని పైఅధికారులకు తెలియజేశామని వివరించారు. పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులు, 250 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కరోనా మళ్లీ ప్రబలుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: ఉపవాసం వద్దన్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య!