ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మండల బంద్ పాటించారు. పలు వ్యాపార సంస్థలను, దుకాణాలను మూసివేయించారు. అనంతరం వరంగల్-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ రామచంద్ర నాయక్ కోరారు. ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైనది కాదని తెలిపారు.
ఇవీ చూడండి: సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్టీసీ ఐకాస