ETV Bharat / state

ఇవాళ బయ్యారంలో తెరాస ఆధ్వర్యంలో ఉక్కు నిరసన దీక్ష.. - ఉక్కు కర్మాగారం ఏర్పాటు

TRS protest for Bayyaram Steel Plant: బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తెరాస పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ బయ్యారంలో ఉక్కు నిరసన దీక్ష చేపట్టనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత సహా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఉక్కుపరిశ్రమపై కేంద్ర వైఖరిని తెరాస నేతలు ఎండగట్టనున్నారు.

TRS Leaders protest for Bayyaram Steel Plant

author img

By

Published : Feb 23, 2022, 5:29 AM IST

ఇవాళ బయ్యారంలో తెరాస ఆధ్వర్యంలో ఉక్కు నిరసన దీక్ష..

TRS protest for Bayyaram Steel Plant: బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న తెరాస... మరో పోరాటానికి సిద్ధమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా... ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ దీక్ష చేపట్టనుంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ అంశంపై కేంద్రం బృందాలు బయ్యారంలో పలు మార్లు సర్వే చేశాయి. పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, ఇనుప రాయి గుట్ట, నీటి లభ్యత, రైల్వేలైన్, విద్యుత్ సదుపాయం తదితర అంశాలను పరిశీలించాయి. ఈ సర్వేల అనంతరం ఇనుపరాయి నాణ్యత సరిగా లేదంటూ.. కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం చేతులెత్తేసింది. తాజాగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో తెరాస నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి, విభజన చట్టంలో పొందుపరిచి మరీ కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తూ వస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. పైప్‌లైన్‌ ద్వారా ముడి ఇనుము సరఫరా చేసినా ఖర్చు భరిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు స్పష్టం చేశారని తెరాస చెబుతోంది. కర్మాగారం కోసం ప్రయత్నించకుండా... ఇక రాదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పడం దారుణమని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.

ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు రిలే నిరాహార దీక్షలు, చలో కలెక్టరేట్ తదితర కార్యక్రమాలను చేపట్టగా.... ఇవాళ మరోసారి ఒకరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు తెరాస నాయకులు ప్రకటించారు. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు నినాదంతో తెరాస గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.