ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తెరాస నాయకులు దాడి చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.
నెల్లికుదురులో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో కార్యకర్తలతో కలిసి ప్రేమేందర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడ తెరాస, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలోనే తనపై దాడి చేశారని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. గులాబీ పార్టీ నాయకుల దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.
ఇదీ చదవండి: ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం