ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదంటూ ఆత్మహత్యకు యత్నించిన యువకుడు సునీల్ నాయక్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ... మృతిచెందాడు. ఈ ఘటనతో సునీల్ స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని తేజావత్రాంసింగ్ తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.
విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, తండావాసులు మృతుని ఇంటికి చేరుకున్నారు. సర్కారు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదంటూ గత నెల 26న కాకతీయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో సునీల్ పురుగుల మందు సేవించాడు. పరిస్థితి విషమించడంతో గత నెల 28న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు.
ఇదీ చూడండి: ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ మృతి