ETV Bharat / state

'సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి'

"ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు" కార్యక్రమంలో మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసి... బ్లీచింగ్​ పౌడర్​ చల్లారు. సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

torrur municipal chairmen participated in sanitation program
'సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి'
author img

By

Published : Jul 12, 2020, 1:09 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం "ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు" కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్​ని తానే స్వయంగా చల్లారు.

ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, పూల కుండీలు, పాత టైర్లు, గుంటల్లో ఉన్న నీటిని తొలగించుకోవాలని ఛైర్మన్​ సూచించారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలు పరిశుభ్రత పాటించాలని రామచంద్రయ్య సూచించారు.

ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.