ETV Bharat / state

రోజురోజుకు పెరుగుతున్న కరోనా.. తాజాగా 3 కేసులు - three cases in mahabubabad district

మహబూబాబాద్​ జిల్లాలో తాజాగా నమోదైన మూడు కేసులతో జిల్లాలో కొవిడ్​ సోకిన వారి సంఖ్య 47కు చేరింది. ఇప్పటివరకు 19 మంది డిశ్చార్జ్​ కాగా.. ఒకరు మృతి చెందారు. కొవిడ్ సోకిన గ్రామాలకు వెళ్లి వైద్య ఆరోగ్య అధికారులు తగు సూచనలు చేశారు.

three cases in mahabubabad district
రోజురోజుకు పెరుగుతున్న కరోనా.. తాజాగా 3 కేసులు
author img

By

Published : Jul 8, 2020, 8:49 AM IST

మహబూబాబాద్​ జిల్లాలో తాజాగా మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు కేసులు తొర్రూరు మండలానికి చెందగా.. మరొకటి రెడ్యాల గ్రామానికి చెందినట్లుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెల్లడించారు. వీటితో జిల్లాలో 47 మందికి వైరస్​ సోకగా ఇందులో 19 మంది కోలుకున్నారు. 27 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... ఒకరు మృతి చెందారు.

కొవిడ్​-19 నిర్ధరణ అయిన బాధితులకు ప్రైమరీ కాంటాక్ట్​లో ఉన్నవారిని హోం క్వారంటైన్​కు తరలించారు. జిల్లా కో ఆర్డినేటర్, తహశీల్దార్ కొవిడ్ సోకిన గ్రామాలకు వెళ్లి అక్కడ శానిటైజ్​ చేయించారు. గ్రామస్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్​లో అనౌన్స్ చేయిస్తూ గ్రామస్థులకు సూచనలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.