ETV Bharat / state

బలవుతున్న వన్యప్రాణులు.. కనిపించని రక్షణ చర్యలు - mahabubabad latest news on wildlife

జిల్లాలో అడవులన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. వన్యప్రాణులకు సరిపడినంత మేత కూడా లభిస్తుంది. వాటికి అటవీశాఖ అధికారులు తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. అయినా కొన్ని వన్యప్రాణులు దారి తప్పి ఊళ్ల సమీపంలోకి వస్తున్నాయి. అలా వచ్చి వేటగాళ్లకు బలవుతున్నాయి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం, వేటగాళ్లపై సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఊళ్లోకి వచ్చిన వాటిని సొంత పెంపుడు జంతువులా చూసుకుని సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి.

there is no actions to protect wildlife and we must save it
బలవుతున్న వన్యప్రాణులు.. కనిపించని రక్షణ చర్యలు
author img

By

Published : Dec 4, 2020, 3:42 PM IST

ఈ నెల 1న కొత్తగూడ మండలం రేన్యతండా సమీపంలోని అడవి నుంచి ఒక సాంబరు జింక చెరువులో నీళ్లు తాగడానికి రాగా వేటగాళ్లు గొడ్డలితో, కర్రలతో కొట్టారు. వన్యప్రాణిపై దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా వన్యప్రాణులను వేటాడటమే లక్ష్యంగా కొందరు వేటగాళ్లు కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం ప్రాంతంలోని అడవుల్లో ఉచ్చులు వేస్తూ వాటిని బలిగొంటున్నారు.

ఇలాంటి ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది తరచూ సందర్శిస్తూ వేటగాళ్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. అడవుల్లో అప్పుడప్పుడు నీళ్లు దొరక్కపోవడంతో పచ్చటి మేత లభించే ప్రదేశాలను, దాహం తీర్చే నీటిరేవులను వెతుక్కుంటూ జంతువులు వలసబాట పడుతున్నాయి. ఈ క్రమంలో అవి గ్రామాల్లోకి వస్తున్నాయి.

there is no actions to protect wildlife and we must save it
2014లో వేటగాడి ఉచ్చుకు మృతిచెందిన కనుజు

చట్టం చట్టుబండలు:

అడవి జంతువులను కాపాడేందుకు కల్పించిన చట్టాలు చట్టుబండలుగా మారాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని అధ్యాయం 3, సెక్షన్‌ 9 కింద అడవి జంతువులను వేటాడటం నిషేధం. జంతువులను వేటాడరాదని 11, 12 సెక్షన్లు వివరిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు విధిస్తారు. నేరం చేసిన వారికి, అందుకు సహాకరించిన వారికి మూడు ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.25వేలు నగదు జరిమాన విధిస్తారు.

రేన్యతండ సమీపంలో వేటగాళ్ల దాడిలో గాయపడిన సాంబారుజింక

గత సంఘటనలు మచ్చుకు కొన్ని..

* 2018 జనవరిలో కొత్తగూడ మండలం కోనాపురంలో వేటాడిన అడవిపంది స్వాధీనం.

* 2017 మార్చిలో ఓటాయిలో అడవి పంది మాంసాన్ని గుర్తించి స్వాధీనం.

* 2014లో ఇదే మండలం చెరువు ముందుతండా అటవీప్రాంతంలో వేటగాడి ఉచ్చుకు బలైన కనుజు స్వాధీనం.

* 2009లో గంగారం అడవుల్లో పులిని చంపి, పులిచర్మాన్ని విక్రయించేందుకు తరలిస్తుండగా స్వాధీనం.

* 2019లో చెరువుముందు తండా వద్ద నెమళ్లను వేటాడిన నిందితుడిపై కేసు నమోదు.

* 2020 మార్చిలో కొత్తగూడ చిలుకమ్మనగర్‌ వద్ద జింకను వేటాడిన నిందితులపై కేసు నమోదు.

* 2020 డిసెంబరు 1న రేన్యతండాలో నీళ్లకోసం వచ్చిన సాంబరు జింకను గొడ్డళ్లతో నరికి చంపేందుకు యత్నించిన ఆరుగురు వేటగాళ్లపై కేసు నమోదు.

వన్యప్రాణులను వేటాడితే పీడీయాక్టు..

వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. గ్రామాల్లోని వేటగాళ్లను గుర్తించి చర్యలు చేపడుతున్నాం. వన్యప్రాణి వేటలో భాగస్వాములైన ప్రజాప్రతినిధుల పదవి రద్దు కోసం కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నాం. పీడీయాక్టు నమోదు చేసేందుకు చర్యలు చేపడతున్నాం. వన్యప్రాణుల సంరక్షణ నిమిత్తం బోర్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశాం.

-లక్ష్మీనారాయణ, ఎఫ్‌ఆర్‌వో-కొత్తగూడ

ఇదీ చూడండి: గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.