రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా భాజపా నాయకులు ఆత్మీయ ములాఖత్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని భాజపా రాష్ట్ర నాయకులు రాజవర్దన్ రెడ్డి కోరారు.
ఇవీచూడండి: బండ నుంచి ఉబికివస్తున్న నీరు.. లింగేశ్వరుని మహిమేనా?