మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 47 మంది బాధితులకు ఎంపీ మాలోత్ కవిత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా చెక్కుల పంపిణీలో లబ్ధిదారుల మధ్య 3 ఫీట్ల దూరం ఉండేలా చూశారు.
నిరుపేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. లబ్ధిదారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది: దానం