ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపును కోరుతూ.. విద్యార్థి ఐకాస చేపట్టిన బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్యోగాల సాధనకై నిరుద్యోగుల పక్షాన గొంతు వినపించడానికి ప్రొఫెసర్ కోదండరామ్‌ను.. శాసన మండలికి పంపాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రను చేపట్టామని తెలిపారు. పట్టభద్రులు ప్రొఫెసర్ కోదండరామ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని.. నేడు సీఎం కేసీఆర్ ఆ ట్యాగ్ లైన్‌ను మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన మహిళామణుల గురించి తెలుసా...?