మహబూబాబాద్ జిల్లాలో 2016లో దంతాలపల్లి నూతన మండల కేంద్రంగా ఆవిర్భవించింది. గ్రామానికి చెందిన చెలగొల వెంకన్నకు చెందిన ఓ ఇంటిని అధికారులు అద్దెకు తీసుకున్నారు. రెండు సంవత్సరాల కాలంలో కేవలం సంవత్సరానికే అద్దె చెల్లించారని వెంకన్న తెలిపాడు. మరో 15 నెలల అద్దె చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిపారు. వీధుల్లోకి వచ్చిన కార్యాలయ సిబ్బంది కాసేపు నిరీక్షించారు. అనంతరం అధికారులు అద్దెచెల్లిస్తామని హామీ ఇవ్వడం వల్ల కార్యాలయానికి వేసిన తాళాలు తీశారు.
ఇవీ చూడండి: తప్పుడు పని అన్నందుకు ప్రాణం తీశాడు