ETV Bharat / state

'ఎస్సీ కార్పొరేషన్​ రుణాలు మంజూరు చేయాలి' - ఎస్సీ కార్పొరేషన్​ రుణాలు తాజావార్తలు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని పురపాలక శాఖ కార్యాలయం ముందు కేవీపీఎస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్​లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్​ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

telangana-kvps-demands-for-release-sc-corporation-loans-in-mahabubabad-district
'ఎస్సీ కార్పొరేషన్​ రుణాలు మంజూరు చేయాలి'
author img

By

Published : Jul 6, 2020, 10:02 PM IST

పెండింగ్​లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే మంజూరు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా దళిత నిరుద్యోగులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పురపాలక అధికారులు పెండింగ్​లో ఉంచుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు స్కైలాబ్​ బాబు ఆరోపించారు. ఇక గ్రౌండింగ్ చేయవలసిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

దీనివల్ల ఎస్సీ నిరుద్యోగులు రుణాలు నోచుకోకపోవటం వల్ల తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్​డౌన్​ కారణంగా 29 శాతం మంది ఉపాధిని కోల్పోయారని వెల్లడించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రుణాలను మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్​కు 1,500 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.