మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని రేకుల తండాలో ఆయనో దేవుడు. గ్రామంలోని ఎంతో మంది విద్యాకుసుమాలను ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు సేవలందించాడు. ఇప్పుడు పదవీ విరమణ పొందుతున్నాడు. ఉపాధ్యాయుడు రామ నరేందర్‌కు తండా వాసులకు ఉన్న అనుబంధం ఎనలేనిది. తండాలో ఓ పదేళ్ల తరానికి విద్యా సేవలందించిన ఉపాధ్యాయుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. ఎడ్ల బండిపై ఘనంగా ఊరేగింపు చేశారు. ముందు పాటలు, విద్యార్థుల నృత్యాలతో గ్రామస్థులందరూ కలిసి పాల్గొన్న ఈ దృశ్యం మీ అందరి కోసం..
ఇదీ చూడండి: భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం