మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం (super spiders vaccination) కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లాలో సూపర్ స్పైడర్లకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో 1,350 మందికి టీకా ఇవ్వనున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే(MLA) శంకర్ నాయక్‌లు సందర్శించారు.
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జర్నలిస్టులు, గ్యాస్ సరఫరా చేసే వారు, పెట్రోల్ బంక్‌లో పనిచేసే వారు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫెర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ సిబ్బంది, చిరు వ్యాపారులకు వ్యాక్సిన్ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిబంధనలు, సలహాలు, సూచనలు ప్రజలంతా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. లాక్డౌన్(Lock down) వెసులుబాటు సమయంలో అత్యవసరమైన పని ఉన్న వారు మాత్రమే బయటకు రావాలని ఆయన తెలిపారు. అవసరం లేని వారు బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: Weather Report: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు... హైదరాబాద్‌లో ఎండలు