ETV Bharat / state

ప్రతి ఇంట్లో నిల్వ నీటిని తొలగించాలి: కలెక్టర్‌ గౌతమ్‌ - Corona disturbance in Mahabubabad district

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను కలెక్టర్‌ గౌతమ్‌ పరిశీలించారు. ప్రతి ఇంట్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించుకోవాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాల్లో ఫ్రైడే డ్రైడేను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Special sanitation work undertaken in Ward 10 and 11 of the Maripada Municipality
'పట్టణాల్లో ఫ్రైడే డ్రైడే పటిష్టంగా అమలు'
author img

By

Published : Jun 5, 2020, 10:00 PM IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాల్లో ఫ్రైడే డ్రైడేను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ప్రతి ఇంట్లో నిల్వ ఉన్న వర్షపునీటిని తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కాల్వల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని.. పనులు సక్రమంగా చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వర్షపునీరు నిల్వ ఉండే వస్తువులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పారిశుద్ధ్య పనులు..

ఎయిర్ కూలర్​లలో ప్రతి రోజు తప్పనిసరిగా నీటిని మార్చుకోవాలని కలెక్టర్‌ గౌతమ్‌ ప్రజలకు సూచించారు. మండలంలోని ఓ తండాలో కరోనా పాజిటీవ్‌ కేసు నమోదైన నేపథ్యంలో.. తండాను పరిశీలించి గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని.. కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్యాధికారి శ్రీరాంతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.