మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో ఆరో విడత హరితహారంలో భాగంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రధానంగా నీడనిచ్చే, పండ్ల మొక్కలు నాటాలని మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు.