సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాలంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు నిరసన చేపట్టారు. ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టుతో డోర్నకల్ మండలంలోని రావిగూడెం, మన్నెగూడెం, అందనాలపాడుకు చెందిన సుమారు 200 మంది సన్న, చిన్నకారు గిరిజన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీతారామ ప్రాజెక్ట్‌తో తమ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తీసుకుపోయేందుకే ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రజా అవసరాల కోసం తమ భూములు ఇస్తామని, నష్ట పరిహారం మాత్రం రూ. 30 లక్షలు చెల్లించాలని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.10 లక్షల మాత్రమే ఇస్తామని చెబుతోందని ఆరోపించారు. భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెప్పినప్పటికీ... కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు.
ఇదీ చూడండి: కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: నటుడు సుమన్