మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారులోని గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ హన్మకొండ డిపోకు చెందిన బస్సు... ఆసిఫాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న పత్తి లారీ ఢీ కొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండకు చెందిన లారీ డ్రైవర్ డొడ్డ శివశంకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...