ETV Bharat / state

RTC Bus: ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - ఆర్టీసీ బస్సు ప్రమాదం

మహబూబాబాద్‌ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

RTC bus crashes into house in Mahabubabad district

author img

By

Published : Jun 3, 2021, 8:10 AM IST

ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా డిపోకు చెందిన బస్సు మరిపెడ మీదుగా సూర్యాపేట వెళ్తోంది. బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు.

ద్విచక్ర వాహనదారుడిని తప్పించబోయి:

బస్సు అయ్యగారిపల్లికి చేరుకున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఇద్దరు పిల్లలతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. వేగంతో ఉన్న బస్సు అతడిని తప్పించే క్రమంలో.. రహదారి పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీ గోడను ఢీకొని ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లి నిలిచి పోయింది. ఊహించని ఈ ప్రమాదంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న వారంతా క్షేమంగా ఉండి.. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ అధికారులు, పోలీసులు పరిశీలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రజలు సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఇదీ చుడండి: Governor: కొవిడ్​పై దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం: తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.