కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్ మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. డోర్నకల్, కురవి, మరిపెడ, చిన్న గూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లో జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తమ గ్రామాలకు కొత్తవారు రావద్దంటూ రహదారుల నిర్బధం చేపట్టారు. దంతాలపల్లిలో లాక్‌డౌన్ అమలు తీరును తొర్రూర్ సీఐ పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము