ETV Bharat / state

లాక్​డౌన్​తో రహదారులు నిర్మానుష్యం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

roads are empty due to lockdown effect
లాక్​డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన రోడ్లు
author img

By

Published : May 12, 2021, 2:31 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉదయం 10 గంటల నుంచే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రహదారులు, ఆర్టీసీ బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. మహబూబాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై పోలీసులు 11 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సరైన పత్రాలు ఉంటేనే వాహనాలను అనుమతిస్తున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. లాక్​డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన వారు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-పాస్​లు, లాక్​డౌన్​లో సమస్యలపై పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలు ఉన్నవారు సంప్రదించాలని తెలిపారు.

ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా ప్రయాణికులు లేక మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో కేవలం 4 బస్సు సర్వీసులను మాత్రమే నడిపించారు. ఉదయం కూరగాయల మార్కెట్ సహా పలు దుకాణాల్లో రద్దీ నెలకొంది.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.