మహబూబాబాద్ జిల్లాలోని జమాండ్లపల్లి నుంచి కంబాలపల్లి వరకు ఉన్న 365 జాతీయ రహదారి పొడవునా రైతులు మూకుమ్మడిగా మొక్కజొన్నలను ఆరబోశారు. రోడ్డుపైన ఆరేసిన మొక్కజొన్నలను దూరం నుంచి చూస్తే మొత్తం పచ్చరంగేసినట్లుగా కనిపించడం విశేషం. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. వాహనదారులు మాత్రం ప్రయాణం కష్టమవుతోందని వాపోతున్నారు. రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : చర్చలకు రమ్మంటే వస్తాం.. లేదంటే సమ్మె కొనసాగిస్తాం...