జాతీయ జెండాను ఎగురవేసిన ప్రజాప్రతినిధులు - మహబూబాబాద్ జిల్లా వార్తలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల((telangana formation day 2021))ను అన్ని వర్గాల ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు.
జాతీయ జెండాను ఎగురవేసిన ప్రజాప్రతినిధులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2021)ను అన్ని వర్గాల ప్రజలు జరుపుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డోర్నకల్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహుల పేట, దంతాలపల్లి మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. దంతాలపల్లిలో ఎంపీపీ ఉమా జాతీయ జెండాను ఎగురవేశారు.