2,400 మంది ఓటర్లున్న ఆ గ్రామంలో 400 రైతు కుటుంబాలున్నాయి. కానీ అందులో ఒక్కరికి కూడా పాసు పుస్తకం జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ ఊళ్లో రెండుసార్లు సర్వే నిర్వహించినా ఫలితం కనిపించలేదని వాపోయారు. రాష్ట్రమంతటా పాసు పుస్తకాలు జారీ అయి, రెండు విడతల రైతుబంధు చెక్కులను అందుకుంటే తమ గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా చెక్కు రాలేదని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఇద్దరు రైతన్నలకు బీమా వర్తించలేదని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే తమకు పాసు పుస్తకాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్