మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి భాజపా రాష్ట్ర నాయకుడు జాటోత్ హుస్సేన్ నాయక్ వెయ్యి మాస్కులను అందించారు. పోలీసు సిబ్బందికి మా వంతు సాయం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎనిమిది వేల కుటుంబాలకు నిత్యావసరాలు, 10 వేల మాస్కులను పంపిణీ చేశామన్నారు.
ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. దయచేసి లాక్డౌన్ ఉన్నంత వరకు ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంతంగా హైరిచ్ సంస్థ పేరుతో 20 వేల మాస్కులను తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు యాప సీతయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఖరీఫ్, రబీ పేర్లు రద్దు..వానాకాలం, యాసంగి ముద్దు