ETV Bharat / state

'మాటలతో మాయ చేస్తున్నారు.. బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది' - తెలంగాణ రాజకీయ వార్తలు

Ponguleti Srinivas Reddy started Koram Camp office: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కోరం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలను మాటలతోనే మాయ చేస్తున్నారని.. వాగ్దానాలను అమలు చేయడం లేదని విమర్శించారు.

పొంగులేటి
పొంగులేటి
author img

By

Published : Mar 4, 2023, 7:07 PM IST

Updated : Mar 4, 2023, 7:37 PM IST

Ponguleti Srinivas Reddy started Koram Camp office: ఎందరో ఆత్మ బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడచిన తొమ్మిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలంలో చేసిన వాగ్దానాలు ఎంత వరకు అమలు చేశారో మీరంతా చూస్తున్నారని.. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కోరం క్యాంప్ కార్యాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ... కేసీఆర్ మాటలు, కబుర్లు, ఆలోచనలకే పరిమితమయ్యారు తప్ప.. ఆచరణలో పెట్టింది ఐదు శాతం కూడా లేదని విమర్శించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రైతు రుణాలు, మహిళలకు జీరో వడ్డీకి రుణాలు, విద్యార్థులకు ఉచిత విదేశీ చదువులు, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు. అనేక కార్యక్రమాలు మాటలకే పరిమితం అయ్యాయే తప్ప.. అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల ముందు మాయ మాటలతో గారడి చేస్తున్నారని, ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే కాదు, నాలుగున్నర సంవత్సరాలుగా మీతోనే ఉంటున్నానని, కార్యకర్తల కష్టసుఖాలు పంచుకునేందుకు ఈ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పొంగులేటికి బయ్యారంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

''అనేక మంది ఆత్మ బలిదానాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న కేసీఆర్​ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితం అయ్యాయి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రైతు రుణాలు, మహిళలకు జీరో వడ్డీకి రుణాలు, విద్యార్థులకు ఉచిత విదేశీ చదువులు, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి అనేక కార్యక్రమాలు మాటలకే పరిమితం అయ్యాయి తప్ప అమలు కాలేదు. తెలంగాణ బిడ్డల కలలకే పరిమితం అయ్యాయి. ఆలోచనలకే పరిమితం అయ్యాయి. ఆచరణలో పెట్టింది ఇచ్చిన వాగ్దానాలలో ఐదు శాతం కూడా లేదు. మాయ మాటలతో గారడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనమందరం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.''-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ

కోరం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన పొంగులేటి

ఇవీ చదవండి:

Last Updated : Mar 4, 2023, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.