వరంగల్‌కు చెందిన కొప్పుల అనిల్ అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన ఓ శుభకార్యానికి ఆర్టీసీ బస్సులో ఏడు తులాల బంగారు ఆభరణాల బ్యాగుతో బయలుదేరాడు. తొర్రూరులో ప్రయాణీకుల హడావుడి మధ్య బస్సులోనే బ్యాగ్ మరిచిపోయి బస్సు దాగారు. బస్టాండ్ నుంచి బస్సు వెళ్లిపోయిన కొంత సమయం తరువాత బ్యాగ్ మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా కంగుతిన్నారు.
బ్యాగ్ పోయిందని భావించిన అనిల్ జరిగిన పొరపాటును తన మిత్రులకు తెలియజేశారు. ఈ విషయం కాస్తా మరిపెడ పోలీసులకు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి ఆయన వచ్చిన బస్సులో వెతికి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తికి సమాచారం అందించారు. రూ.2.70లక్షల విలువ గల బంగారు ఆభరణాల బ్యాగును సదరు వ్యక్తికి ఎస్సై అనిల్ అప్పగించారు.
ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు