జైలు శిక్ష అనుభవిస్తున్న వరవరరావు విడుదల కోరుతూ.. సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. రోడ్డు వెళ్తున్న ప్రతీ వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని వివరాలు ఆరా తీశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..