ETV Bharat / state

Podu lands Issue: పోడు భూముల్లో ఘర్షణ వాతావరణం - Mahabubabad district news

Podu lands Issue: అటవీ అధికారులకు, పోడు భూముల రైతులకు స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. జేసీబీలతో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొడుతుండగా మహిళా రైతులు అడ్డుకున్నారు.

Podu lands Issue
Podu lands Issue
author img

By

Published : Dec 8, 2021, 7:08 PM IST

Podu lands Issue: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అటవీ అధికారులకు, పోడు రైతులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. జేసీబీలతో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొడుతుండగా మహిళా రైతులు అడ్డుకున్నారు. ట్రెంచ్‌లో దిగి నిరసన వ్యక్తం చేశారు. మహిళా రైతులను ట్రెంచ్‌లో నుంచి బయటకు లాగి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కొన్నేళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూమిలో అధికారులు ట్రెంచ్ కొడుతున్నారని బాధిత రైతులు వాపోయారు. తాము 1973 నుంచి సాగు చేసుకుంటున్నట్లు వివరించారు. అటవీ అధికారులు భూమిని లాక్కొవడం వల్ల తాము ఎలా బతకాలని ఆవేదన వెలిబుచ్చారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.

పోడు భూముల్లో ఘర్షణ వాతావరణం

ఇదీ చదవండి: Cyber Crime Today : సైబర్​ కేటుగాళ్ల నయా పంథా.. అద్దె ఇళ్ల నుంచే మోసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.