గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వెళ్తున్నారు... వేడుకకు కాదు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కడుతున్నారు... ఓటు వేయడానికి కాదు. దవాఖానా ప్రాంగణం కిక్కిరిసి పోయింది... జాతర కాదు. అది కొవిడ్ టీకా కేంద్రం. కొన్ని రోజులుగా టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలు క్రమంగా పోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. స్వచ్ఛందంగా వస్తూ టీకా వేయించుకుంటున్నారు.


మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వాసుపత్రులు టీకా కోసం వచ్చిన వారితో కిటకిటలాడుతున్నాయి. దంతాలపల్లి, నరసింహులుపేట గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జనసంద్రంగా మారింది. సుమారు 38 గ్రామాల నుంచి వచ్చిన వారితో ప్రాంగణం నిండిపోయింది. టీకా కోసం వచ్చిన వారిలో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉండడం విశేషం.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 3,307 కరోనా కేసులు, 8 మరణాలు