మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బియ్యం విక్రయ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి.. విక్రయిస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన బియ్యం, నూకల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 270 బస్తాలను పౌరసరఫరాల అధికారులకు అప్పగించినట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: బాసర ఏఈఓ శ్రీనివాస్‌పై మరోసారి సస్పెన్షన్ వేటు