మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. నాంచారిమడుర్, పెద్దమంగ్య తండా, కోమ్మనపల్లి తండా, అమ్మపురం, కంఠయపాలెం, గ్రామాల్లో రైతు వేదిక భవనాలు, స్మశానవాటికలు, పంచాయతీ భవనాలను ప్రారంభించారు.
రైతు రాజ్యం రావాలనేదే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమని ఎర్రబెల్లి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రైతులను రాజులను చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు తెలిపారు.
ఇదీ చదవండి: బతుకు పోరాటంలో కుటుంబానికి మహిళల చేదోడు